vineelasubramanyam

vineelasubramanyam Lives in Khammam, Telangana, India

believe in you'r self ✊️✊️✊️

  • Latest
  • Popular
  • Video
#sunsetnature  sunset nature ఎన్నో సాయంత్రాలు 
నీ మాటల మధురిమలో 
మరెన్నో సాయంత్రాలు 
నీ నవ్వుల హరివిల్లులో 
రోజులు ఎన్ని అస్తమించినా 
దిగులుండదు నీ జతలో 
మరో కొత్త ఉదయం
 గురించి గుబులుండదు నీ ఒడిలో 
కలిసి వేసే ఒక్కో అడుగు 
గడిచే ఒక్కో నిమిషం
నిత్యం ఉదయించే మన ప్రేమకి 
నేడు పలికే చిరునవ్వుల వీడ్కోలు కనుక

©vineelasubramanyam

#sunsetnature #Life

189 View

మాటలన్నీ మూటకట్టి తేనా? మదిలోని భావాలు తెలుప. సిగ్గుల మొగ్గలన్నీ సిగను చుట్టి రానా? సడిచేయక నీ సరసన చేర. దారితప్పిన ధ్యాసని మందలించి పంపనా? నీ దరిచేరే వేళ ధైర్యంగా మెలగమని. చిన్ని ఆశలన్నీ రాసులుగా పోయనా? శ్వాసన నిండిన నీకు ప్రతిబింబమై మారనా? రాఘవుడంటి నీ జతన జానకిగా నిలవనా? జీవితమంతా నీ నీడన నీ సగమై బ్రతుకనా? నా హృదయ సామ్రాజ్యానికి చక్రవర్తి గా ప్రకటిస్తున్నా పదవి స్వీకరించి పదిలంగా కాచుకుంటావా? నా ప్రేమని ప్రాణాన్ని నైవేద్యంగా సమర్పిస్తాను....... "Happy Love Anniversary My Love ❤️❤️❤️" ©vineelasubramanyam

#soulmate  మాటలన్నీ మూటకట్టి తేనా?
 మదిలోని భావాలు తెలుప.
సిగ్గుల మొగ్గలన్నీ సిగను చుట్టి రానా?
 సడిచేయక నీ సరసన చేర.
దారితప్పిన ధ్యాసని మందలించి పంపనా?
నీ దరిచేరే వేళ ధైర్యంగా మెలగమని.
చిన్ని ఆశలన్నీ రాసులుగా పోయనా?
శ్వాసన నిండిన నీకు ప్రతిబింబమై మారనా?
రాఘవుడంటి నీ జతన జానకిగా నిలవనా?
జీవితమంతా నీ నీడన నీ సగమై బ్రతుకనా?

 నా హృదయ సామ్రాజ్యానికి
చక్రవర్తి గా ప్రకటిస్తున్నా
పదవి స్వీకరించి పదిలంగా కాచుకుంటావా?
 నా ప్రేమని ప్రాణాన్ని నైవేద్యంగా సమర్పిస్తాను.......
"Happy Love Anniversary My Love ❤️❤️❤️"

©vineelasubramanyam

#life #soulmate

11 Love

ఏ జన్మది ఈ బంధమంటే చెప్పలేను, ఎన్ని జన్మల వరకు అంటే సమాధానం లేదు, కానీ నీ చేయి పట్టి నడిచిన ఆ మొదటి క్షణం నూరేళ్ళ నా జీవితానికి ధర్పణమై నిలిచింది, ఆ క్షణం కలిగిన ఆనందం నూరేళ్ళూ శాశ్వతం అని నే తెలుసుకున్న ఆ నిమిషమే అర్ధమైంది నా ఈ దేహం ప్రాణం రెండూ నీ సొంతమని, ఏ కష్టమైన నీ అనుమతి లేనిది నా దరి చేరలేదని, ఏమంత ఇష్టమంటే పేజీల కొద్దీ రాయగలను కానీ ఎందుకు నేనే అని అడిగితే మాత్రం నా చిన్న చిరునవ్వు చాలు. Happy Anniversary My Love ❤️ ©vineelasubramanyam

#anniversary #husband  ఏ జన్మది ఈ బంధమంటే చెప్పలేను,
ఎన్ని జన్మల వరకు అంటే సమాధానం లేదు,
కానీ నీ చేయి పట్టి నడిచిన ఆ మొదటి క్షణం
 నూరేళ్ళ నా జీవితానికి ధర్పణమై నిలిచింది,
ఆ క్షణం కలిగిన ఆనందం నూరేళ్ళూ శాశ్వతం అని
నే తెలుసుకున్న ఆ నిమిషమే అర్ధమైంది 
 నా ఈ దేహం ప్రాణం రెండూ నీ సొంతమని,
ఏ కష్టమైన నీ అనుమతి లేనిది నా దరి చేరలేదని,
ఏమంత ఇష్టమంటే పేజీల కొద్దీ రాయగలను
 కానీ ఎందుకు నేనే అని అడిగితే మాత్రం
నా చిన్న చిరునవ్వు చాలు.
Happy Anniversary My Love ❤️

©vineelasubramanyam
#husband #Soul  మాటిస్తావా నా సంతోషంలో స్నేహితునిలా,
సమస్యల్లో సాయమొచ్చే సోదరునిలా,
భయంలో ధైర్యం నింపే నాన్నలా,
అలిగి గోలచేస్తే బుజ్జగించే అమ్మలా,
ఆటలాడి అల్లరి చేయడానికి నా తోటి పాపలా,
నా ప్రతి పొరపాటును సరిచేసే గురువులా,
నా ప్రతి అడుగులో నా వెంట నడిచే తోడులా,
దుఃఖంలో అక్కున చేర్చుకుని ఓదార్చే వాడిలా,
ఆయువు ముగిసే వరకు నా వెన్నంటి ఉండే నీడలా,
 మరుజన్మకు కూడా నా కోసం పుట్టే ప్రేమలా.....

©vineelasubramanyam

#Love #husband #Life #Soul

431 View

#ఆలోచనలు #Motivation  గొంగళి పురుగు దశలో ఉన్నప్పుడు
 చీదరించుకొని దూరం జరిగిన అదే మనం 
సీతాకోక చిలుకగా మారిన తరువాత
వెంటపడి మరీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాం
 జీవితం కూడా అంతే
  నువ్వు సమస్యల సుడిగుండంలో
చిక్కుకుపోయి ఊపిరాడక
బ్రతుకీడుస్తుంటే
 ఈ రోజు నీ నీడని కూడా ఇష్టపడని వారు
 నువ్వు సాధించి నిలబడిన రోజు
 నీ నీడన చోటు కొరకు ఊదరకొడుతూ తిరుగుతారు

©vineelasubramanyam

#Life #Motivation

192 View

#thought

87 View

Trending Topic