గొంగళి పురుగు దశలో ఉన్నప్పుడు
చీదరించుకొని దూరం జరిగిన అదే మనం
సీతాకోక చిలుకగా మారిన తరువాత
వెంటపడి మరీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాం
జీవితం కూడా అంతే
నువ్వు సమస్యల సుడిగుండంలో
చిక్కుకుపోయి ఊపిరాడక
బ్రతుకీడుస్తుంటే
ఈ రోజు నీ నీడని కూడా ఇష్టపడని వారు
నువ్వు సాధించి నిలబడిన రోజు
నీ నీడన చోటు కొరకు ఊదరకొడుతూ తిరుగుతారు
©vineelasubramanyam
#Life #Motivation