ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితం అస్సలు క్షమించరానిది
ఆడిన ఆటలు
ఎంచుకున్న స్నేహితులు
కరిగిపోయిన కాలాలు
మసకబారిన కలలు
తప్పిన మార్గాలు
దారితప్పిన జీవితాలు
కోల్పోయిన ప్రియమైనవాళ్లు
ఎన్నో ఎన్నో అన్నీ ఆనందాన్ని ప్రశ్నగానే మిగులుస్తున్నాయి
అయినా ప్రకృతిలోంచి తెలియని హామీ
రేపు ప్రశాంతంగా ఉంటుందని భరోసా ఇస్తూ
ఆ వాగ్దానం విచ్ఛిన్నమైనప్పుడు
ఈ గాయాలు తిరిగి తెరుచుకుంటాయి
తీవ్ర దుఃఖంతో అపుడు మనసు ఆశను వదిలేసుకుంటుంది
©gopi kiran
#Identity