ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నను నేను
ఎటు వైపు నుంచి ఎటువైపు జారిపోయాను నేను
నేను నేనుగా బ్రతికి ఎన్నాళ్ళైందో
నేను నేనుగా మిగిలింది ఎక్కడో......
పగిలి నిలిచిన వేళ
గతించిన కాలపు గుర్తుల్లో..
నల్లరంగు నీడ బొమ్మలా నేను..
నా వునికిని కోల్పొయాక
నా ఊపిరి మర్చిపోయాక
ఎల ఉన్నానో
ఏమవుతున్నానో తెలియని
నిరంతర నిస్ప్రుహలో
ఎమి కోల్పోయానో నాకే తెలియని గందరగోళంలో
కంగారులో
కన్నీరుతో
రాయెస్తేనే చెదిరిపొయె నిశ్చల నీటి చిత్రంలాంటి చిత్రమైన బ్రతుకులో నేను
నల్లని నీడలా నేను
నాకే తెలియని నలుపులా నేను......
©gopi kiran
#kavi #Telugu