నా మాటలలో పదాలు నువ్వే
నా పాటలలో పల్లవి నువ్వే
నా కవితలలో భావం నువ్వే
నా భవితలో భాగం నువ్వే
నా పోరాటంలో గెలుపువి నువ్వే
నా ఆరాటంలో తలపువి నువ్వే
నా ప్రతి కార్యంలో శ్రీకారం నువ్వే
నా ప్రతి ధ్యానంలో ఓంకారం నువ్వే
నే నోచిన నోములో దేవత నువ్వే
నే వేసిన ప్రేమ జూదంలో విజేత నువ్వే
మరణం ఎదురుగా ఉన్నా ,
యమపాశం నా వైపు దూసుకొస్తున్నా ,
బతుకుపోరులో నా పాత్ర చాలించినా ,
చితిపై నా పార్ధీవదేహం శయనించినా...
నన్ను తనివితీరా హత్తుకొని దహించు జ్యోతివి నువ్వే
కడసారి నా కనుపాపలలో కొలువయ్యే కన్నీటి చిత్రం నీదే....
#KaunTujhe