ఎవడి బ్రతుకు భయం వాడిది
ఎవడి గెలుపు పోరాటం వాడిది
ఎవడి ఎజండా వాడిది
ఎవడి మెను కార్డ్ వాడిది
ఒంటరిగా పోరాడెప్పుడు పొయెదెమి లేదు కాని
కలిసి సాగాలనుకున్నప్పుడె ఇబ్బందంతా
అంతా మనటొనె ఉన్నట్టుంటారు ఎవరూ మనవారు కాదు
మాటలు ఆప్యాయతను నటిస్తుంటాయి
గుందెలు ఎదురుతిరిగుతుంటాయి
అక్కడె మన మీద కొలుకొలేని దెబ్బ పడుతుంది
విశ్వం లో ఉనికే ఊహాచిత్రమవుతుంది
మన అస్తిత్వం ఎమిటనే ప్రశ్న
నెనెక్కడ అనె అనుమానం
నేనెనందుకు అనె సందేహం
అప్పుడె మనసులోతుల్లొ బాధల శిలలు కరగడం మొదలయ్యెది
అప్పుడె అంతరాంతరలల్లొ వ్యధా భరిత సన్నివేశాల రూపకల్పన జరిగేది
ఏకాంతమనుకున్నదంతా ఒంటరితనమని తెలుసుకున్న
మనసు ఆవేదనతో గిలగిలలాడెది
నడిసంద్రం మధ్యలోకి దిక్కులెకుందా విసిరెయబడ్డ అనుభూతి
ఈత రాకపొతే సరే చిటుక్కున చచ్చిపోవచ్చు
తెలిసి తెలియక చేతులు కొట్టుకోవడం వస్తే ఇంకంతే మరన యాతన
ఎంటి...? ఈ జీవితం
ప్రశ్నార్దకానికి ప్రస్నార్దకానికి మధ్య జిరిగే జవాబా ..?
ప్రశ్నె లేని జవాబా....?
మనిషి ఆశతో బ్రతికితే ఉదయించే పరిస్థితే ఇది
మనసుకి ఊహలకి మధ్య అవినాభావ సంభంధం ఎర్పడితె జరిగేదిదే
మనిషి బ్రతుకింతే
మనసు గతి ఇంతే
చావుకు బ్రతుక్కి మధ్య ప్రశ్నలా జీవితం ఇలా నిస్తెజంగా,
నిర్లిప్తంగా, నిర్మానుష్యంగా సాగుతునే ఉంటుంది ....................
©gopi kiran
#leaf