నా నిశ్శబ్దం ఓ అతిపెద్ద గావుకేక
నా ఈ నీరవం ఓ ప్రతిధ్వని
అందుకే అది నా అస్తిత్వాన్ని మంచులా కాపాడుకుంటూంటుంది
అందుకే నా స్థిరత్వాన్ని ఘనంగా ప్రదర్శించగలుగుతుంది
నిశ్శబ్దం ఎప్పటికీ పలకబడే నిజమే
అదెప్పటికీ తలొంచుకోనీయదు
అందుకే నా నిశ్శబ్దం ఓ అతిపెద్ద గావుకేక
వేల వేల గుండెల్ని విధ్వంస రచన చేయగలిగిన క్షిపణి
ఎలాంటి కాలాలని అయినా ఛిద్రం చేయగలిగిన క్షిపణి
ప్రశ్నించే అనుకూల అక్షరం
పోరాడే అతిపెద్ద ఆయుధం
©gopi kiran
#fish